Kishan Reddy : కిషన్‌రెడ్డికి ఛాతిలో నొప్పి రావడానికి కారణమేంటో తేల్చిన వైద్యులు
ABN, First Publish Date - 2023-05-01T07:26:43+05:30
తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి గత రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Delhi : తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి గత రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి 10:50 గంటల సమయంలో తరలించారు. అయితే కేంద్రమంత్రికి ఛాతిలో నొప్పి రావడానికి కారణం గ్యాస్ సమస్య అని వైద్యులు తేల్చారు. కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్ కేర్ యూనిట్‌లో వైద్యులు కిషన్‌రెడ్డికి చికిత్సను అందిస్నతున్నారు. నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
Updated Date - 2023-05-01T07:26:43+05:30 IST