ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy: రెండు నిమిషాల్లో నా ముందుకు రా... లైవ్‌లో ఎస్ఐకి వార్నింగ్.. కాలేజీలో కోమటిరెడ్డి రచ్చ

ABN, First Publish Date - 2023-03-02T19:09:36+05:30

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy) సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) సీరియస్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy) సబ్ ఇన్‌స్పెక్టర్ పై (SI) సీరియస్ అయ్యారు. గూగుల్‌లో చూసి చట్టాలు చదువుకోవాలని తనకే ఎస్ఐ చెబుతున్నారని మండిపడ్డారు. హత్యకు కారణమైన వారిపై హత్యానేరం కింద 302 కేసులు పెట్టాలని విద్యార్థి చెప్పారని అన్నారు. ఆయన కోట్లు లంచాలు తీసుకుంటారని, తాను చట్టాలు చదువుకోవాలని చెప్పడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్పందించి బోగస్ సంస్థలపై పీడీ యాక్టు కేసులు పెట్టాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాలేజీ యాజమాన్యలు విద్యార్థుల నుంచి ఫీజు రూపంలో రూ. 3 లక్షలు తీసుకొని, రూ. 20 నుంచి 30 వేలకు మాత్రమే రశీదు ఇస్తున్నారని మండిపడ్డారు. రెండు నిమిషాల్లో తన ముందుకు రా అంటూ... లైవ్‌లో ఎస్ఐకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలో కోమటిరెడ్డి రచ్చరచ్చ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉండే సహజ స్వేచ్ఛను వినియోగించుకుని నేతలు తమదైన శైలిలో వారివారి నియోజకవర్గాల్లో జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkata Reddy) ఉమ్మడి నల్లగొండతో పాటు దక్షిణ తెలంగాణ (South Telangana)లోని పలు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన శాలిగౌరారం మండలంలో ఇటుకులపాడులో పర్యటించారు. ఈ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోమటిరెడ్డి పర్యటనను బీఆర్‌ఎస్‌ (BRS) శ్రేణులు అడ్డుకున్నాయి. ఎంపీ పర్యటనను అడ్డుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. దీంతో కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది.

ఎంపీ వెంకట్‌రెడ్డి పొంతనలేని ప్రకటనలు చేస్తుండటంతో ఆయన అనుచరులు అయోమయంలో ఉన్నారు. అయితే వెంకట్‌రెడ్డి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో యాత్ర నిర్వహిస్తారనేది తేలగా, అది బైకు, బస్సు యాత్రా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి గుట్ట నుంచి యాత్ర ప్రారంభించి ఆలేరు, జనగాం, సూర్యాపేట, నకిరేకల్‌, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో పర్యటించేందుకు ప్రాథమికంగా రూట్‌ప్లాన్‌ ఖరారుచేసినట్టు తెలిసింది. అయితే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటి వరకు వెంకట్‌రెడ్డి తన అనుచరులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. స్థానికంగా పనిచేసుకుంటున్న దుబ్బాక నర్సింహారెడ్డి సైతం జోడో యాత్ర ప్రారంభించలేదు. మొత్తంగా నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతలు అయోమయంలో ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి



అక్రమ గంజాయి కేసులు జగన్ మెడకే చుట్టుకుంటాయి.. కారణం అదే..

అందుకే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

Updated Date - 2023-03-02T19:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!