ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Koram Kanakayya : నన్ను విమర్శిస్తున్న పువ్వాడ 4 పార్టీలు మారారు

ABN, First Publish Date - 2023-05-30T14:09:12+05:30

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు వర్సెస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తనపై చేసిన వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు వర్సెస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తనపై చేసిన వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య స్పందించారు. నేడు ఇల్లందులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరం కనకయ్య మాట్లాడుతూ.. తనపై పువ్వాడ అజయ్, హరిప్రియ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ధృతరాష్ట్రుని కౌగిలి అని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి మారినందుకు జడ్పీ చైర్మన్‌గా తనను రాజీనామా చేయమంటున్న పువ్వాడ అజయ్ కుమార్.. ఇప్పటికి నాలుగు పార్టీలు మారాడని విమర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మూడు పార్టీలు మారారన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరాను కాబట్టి జడ్పీ చైర్మన్ అవకాశం ఇచ్చారన్నారు. తాను జడ్పీ చైర్మన్ పదవి అడుక్కోలేదని పొంగులేటి అన్నారు.

Updated Date - 2023-05-30T14:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising