ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahalakshmi Scheme: ‘మహాలక్ష్మి’ మురిసింది.. ఈ పథకం కింద ఎంతమంది లబ్దిపొందుతున్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-12-10T12:33:09+05:30

‘మహాలక్ష్మి’తో గ్రేటర్‌లో సుమారు 4లక్షలమంది మహిళా ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా తెలంగాణలోని

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ‘మహాలక్ష్మి’తో గ్రేటర్‌లో సుమారు 4లక్షలమంది మహిళా ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాలనుంచి ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, అల్వాల్‌తోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు రోజూ 1.5లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో 40-50 వేలమంది మహిళా ప్రయాణికులు ఉంటారు. వారంతా ఇకపై ఉచితంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌(Ordinary, Express) బస్సుల్లో ప్రయాణాలు చేయవచ్చు. సోమవారం నుంచి సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాలుంటాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఉచిత ప్రయాణ సేవలపై గ్రేటర్‌లో విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పదిరోజుల పాటు బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందిని నియమిస్తునట్లు గ్రేటర్‌ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన బస్సులు నడుపుతామని పికెట్‌ డిపో మేనేజర్‌ రవీందర్‌నాయక్‌ పేర్కొన్నారు.

విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గుతుంది...

శనివారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వచ్చిన ఉచిత ప్రయాణ సేవలపై ఐటీకార్‌డార్‌లో పలువురు మహిళా ఐటీ ఉద్యోగులను ప్రశ్నించగా.. ఉచిత సేవలపై సమాచారం లేదన్నారు. కొందరు విద్యార్థులకు ఉచిత సేవలు అందిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొనడం కనిపించింది.

చార్జీలు తగ్గిస్తే బాగుండేది

మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించడం హర్షణీయం. అయితే, బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తించేలా చార్జీలు తగ్గిస్తే ఇటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గేది.

- అరుణ రెడ్డి, కుత్బుల్లాపూర్‌

ఆర్థిక భారం తగ్గుతుంది

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా పేద ప్రజల కోసం ఆలోచిస్తూ ఇలాంటి పథకాలు మరిన్ని తీసుకురావాలి. బస్సుల్లో వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారికి ఉచిత ప్రయాణ సేవలతో చార్జీల భారం తగ్గుతుంది.

- స్వప్న, గౌలిపుర

విద్యార్థులకు లాభం

కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత ప్రయాణంతో లాభం జరుగుతుంది. బస్సుల సంఖ్య పెంచితే ఉచిత ప్రయాణ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. బస్సు ప్రయాణాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.

- శిరీష, విద్యార్థి, వనస్థలిపురం

Updated Date - 2023-12-10T12:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising