CM KCR:గద్వాలను గబ్బుపట్టించిందెవరు?.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2023-11-06T18:54:29+05:30
గద్వాల(Gadwala)ను గబ్బుపట్టించిందెవరని సీఎం కేసీఆర్(CM KCR) ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గద్వాలలో ఇవాళ జరిగిన బీఆర్‌ఎస్(BRS) ప్రజాశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
గద్వాల: గద్వాల(Gadwala)ను గబ్బుపట్టించిందెవరని సీఎం కేసీఆర్(CM KCR) ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గద్వాలలో ఇవాళ జరిగిన బీఆర్‌ఎస్(BRS) ప్రజాశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఘన చరిత్ర కలిగిన గద్వాలను గబ్బుపట్టించిన వాళ్లు ఎవరు? రైతులకు, పేదలకు ఏ పార్టీ ఏం చేసిందో గుర్తించుకోవాలి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు(Mahaboobnagar) జిల్లా పంటలతో కళకళలాడుతోంది. ఈ ప్రాంతంలో వాల్మీకి, బోయ కులస్థులుంటారు. వారిని ఎస్టీల్లో కలపడానికి ప్రయత్నించాం. కేంద్రానికి తీర్మానం చేసి పంపితే ఇప్పటికీ స్పందించలేదు. ఆర్డీఎస్ కాలువను కాంగ్రెస్ పార్టీ ఆగం పట్టించింది. కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేటా ముంచుతుంది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులా నడిపిస్తున్న బీఆర్ఎస్ ను మళ్లీ ఆశీర్వదించాలి. ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడకూడదు. పార్టీల చరిత్రలన్నీ మీ ముందున్నయ్. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దశాబ్దాలు పరిపాలించిందో మీకు తెలుసు. ఆ పార్టీని నమ్మితే ఇబ్బందులు తప్పవు" అని సీఎం కేసీఆర్ అన్నారు.
Updated Date - 2023-11-06T18:55:13+05:30 IST