Manuguru: టీ స్టాల్‌లో సంచి.. అందులో రూ. 2 లక్షల విలువైన బంగారం.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-08-11T12:00:49+05:30
మణుగూరు(Manuguru) పట్టణంలోని ఓ టీ స్టాల్‌లో గురువారం సుమారు రెండు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాల
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం), ఆంధ్రజ్యోతి: మణుగూరు(Manuguru) పట్టణంలోని ఓ టీ స్టాల్‌లో గురువారం సుమారు రెండు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాల చేతి సంచిని గుర్తు తెలియని వ్యక్తి మరిచిపోయి వెళ్లాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత గమనించిన యువ నాయకులు సాగర్, డ్యాన్స్ మాస్టర్ ఉమేష్‌లు సంచిని స్ధానిక పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాస్(SI Srinivas)కు అందజేసి తమ నిజాయితీని చాటారు. బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉంటే స్ధానిక పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
Updated Date - 2023-08-11T12:00:51+05:30 IST