ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: మైనంపల్లి రోహిత్ చేరిక ప్రకంపనలు.. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా

ABN, First Publish Date - 2023-10-01T11:52:04+05:30

మైనంపల్లి హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్‌లో చేరిక స్థానికంగా ప్రకంపనలు రేపింది. రోహిత్ చేరికను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ రాశారు.

హైదరాబాద్: మైనంపల్లి హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్‌లో చేరిక స్థానికంగా ప్రకంపనలు రేపింది. రోహిత్ చేరికను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. మైనంపల్లి చేరికను తిరుపతి రెడ్డి వ్యతిరేకించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనలాంటి కార్యకర్తలకు ఈ పార్టీలో స్థానం లేదనే విషయం తేటతెల్లమైందని లేఖలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా టికెట్లు ఇవ్వడం వేదనకు గురి చేసిందని తిరుపతి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోయేది ఆయన వెల్లడించలేదు. ఇక ఈ పరిణామంపై కాంగ్రెస్ వర్గాలు ఇంకా స్పందించలేదు.

Updated Date - 2023-10-01T11:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising