ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Medak Dist.: సిఎస్ఐ చర్చిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

ABN, Publish Date - Dec 25 , 2023 | 07:50 AM

మెదక్ జిల్లా: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రసిద్ధ మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు మొదటి ఆరాధనతో బిషప్ కే. పద్మారావు వేడుకలను ప్రారంభించారు.

మెదక్ జిల్లా: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రసిద్ధ మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు మొదటి ఆరాధనతో బిషప్ కే. పద్మారావు వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పద్మారావు దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చర్చికు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా మెదక్ చర్చి విద్యుత్ కాంతులతో విరజిల్లుతోంది.

ఇంకా భద్రాద్రి కొత్తగూడెంలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని సెంట్ ఆండ్రూస్ చర్చిలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా, వైరా రోడ్ ఆర్‌సీఎం చర్చి, సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 07:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising