ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddipet: సీపీఆర్ ప్రక్రియను ఎవరైనా..ఎప్పుడైనా కొద్దిపాటి శిక్షణతో తెలుసుకోవచ్చు..: హరీశ్

ABN, First Publish Date - 2023-04-09T11:53:24+05:30

సీపీఆర్ ప్రక్రియను ఎవరైనా, ఎప్పుడైనా కొద్ది పాటి శిక్షణతో తెలుసుకోవచ్చు. దేశంలో 15 లక్షల మంది కార్డియాక్ అరెస్ట్‎తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్‎లో కార్డియో పల్మనరీ రెసుసిటేషన్ (CPR ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యకమానికి మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కాశినాథ్. ప్రజాప్రతినిధుల అధికారుల శిక్షణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీపీఆర్ ప్రక్రియను ఎవరైనా, ఎప్పుడైనా కొద్ది పాటి శిక్షణతో తెలుసుకోవచ్చు. దేశంలో 15 లక్షల మంది కార్డియాక్ అరెస్ట్‎తో చనిపోతున్నారు. దాదాపు రోజు 4 వేల మంది మరణించారు. నాలుగు వేల మందిలో ఒక్క శాతం మాత్రమే ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు. మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోతే బ్రైయిన్ డెడ్ అవుతుంది. సీపీఆర్ విధానాన్ని నేర్చుకుంటే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. రాష్టంలో సీపీఆర్ ప్రక్రియ అవగాహన క్రార్యక్రమాన్ని ప్రయిమరి కార్యక్రమంగా చేపట్టాము. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ ఎటాక్ వేరు.. కార్డియాక్ అరెస్ట్ అయిన వారికే సీపీఆర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1860 బ్యాచ్‎ల్లో 36,500 మందికి సీపీఆర్ పై ట్రైనింగ్ ఇచ్చాము. ఈ ట్రైనర్స్ ఒక్కొక్కరు ప్రతి రోజు 20 మందికి శిక్షణ ఇస్తున్నారు. 15 కోట్లతో ఏఈడి మిషన్లు కొనుగోలు చేసి..అన్ని పిహెచ్‎సిలకు అందిస్తామని’’ మంత్రి హరీశ్ తెలిపారు.

Updated Date - 2023-04-09T11:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising