ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VRA: ఇదెక్కడి విచిత్రం.. వీఆర్‌ఏకు వింత పరిస్థితి...

ABN, First Publish Date - 2023-08-04T10:27:30+05:30

వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఓ వీఆర్‌ఏ ప్రాణాలమీదకు తీసుకొచ్చింది.

సిద్దిపేట: వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఓ వీఆర్‌ఏ ప్రాణాలమీదకు తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం వస్తున్నందున రూ.40 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపుతామంటూ సొంత కుటుంబసభ్యులే బెదిరించిన ఘటన జిల్లాలో చోటు చేరుకుంది. జిల్లాలోని నారాయణరావు పేట మండలం జక్కపూర్‌లో మస్కురి (వీఆర్ఏ) సురేష్‌పై ఆయన పాలోల్లు నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వం వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని నిర్ణయించడంతో తమకు డబ్బులు ఇవ్వాలని సురేష్‌పై కొద్ది రోజులుగా కుటుంబసభ్యులు ఒత్తిడికి గురిచేశారు. ‘‘గతంలో మస్కురి బాధ్యత తమదేనని.. తాము వదులుకుంటేనే నీకు వీఆర్‌ఏగా ఉద్యోగం వస్తోంది’’ అంటూ ఆ నాలుగు కుటుంబాలు చెందిన వ్యక్తులు ఆరోపిస్తున్నారు. సురేష్‌కు ప్రభుత్వ ఉద్యోగం వస్తున్నందున తమ నాలుగు కుటుంబాలకు రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు (శుక్రవారం) ఉదయం సురేష్ ఇంటిపై వారు దాడి చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. నాలుగు కుటుంబసభ్యులు దాడితో సురేష్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. ఆ నాలుగు కుటుంబసభ్యుల వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కాగా.. వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 20,555 మంది వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వారి పేస్కేల్‌ను కూడా విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో వీఆర్‌ఏలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-04T10:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising