ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట సిగలో మరో మణిహారం ఈ శిల్పారామం: హరీశ్‌రావు

ABN, First Publish Date - 2023-04-22T22:31:25+05:30

సిద్దిపేట సిగలో మరో మణిహారం ఈ శిల్పారామమని మంత్రి హరీశ్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: సిద్దిపేట సిగలో మరో మాణిారం ఈ శిల్పారామమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో సముద్రం లేని లోటును కూడా తీరుస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ బీచ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని కొమటి చెరువు సమీపంలో శిల్పారామం నిర్మాణానికి మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. రంగనాయకసాగర్ గుట్టను ఒక డెస్టినేషన్ సెంటర్‌గా మార్చబోతున్నామని తెలిపారు. నిర్మించుడు గొప్ప కాదు.. నిలబెట్టుకోవడం గొప్ప అన్నారు. సాధారణంగా సర్కారు పనులు కడతాం కానీ నిలబెట్టుకోవడం ఉండదన్నారు. మరో నెలరోజుల్లో డైనోసార్ పార్క్ త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామన్నారు. ఒక పట్టణం జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే రిక్రియేషన్ కూడా అవసరమేనన్నారు. ప్రజలకు మానసిక ఆనందం, శారీరక ఉల్లాసం కూడా అవసరమన్నారు. శిల్పారామంలో ఆర్ట్, కల్చరల్ ఆక్టివిటీస్ ఉంటాయన్నారు. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిద్దిపేటలో 92 శాతం చెత్త డంప్ యార్డుకు వెళ్లడం లేదన్నారు. పర్యావరణ చైతన్యం సిద్దిపేటలో వచ్చిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సిద్దిపేట అభివృద్ధి చెందుతుందన్నారు. నాలుగు నెలల్లో శిల్పారామం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కళలకు వేదికగా ఈ శిల్పారామం నిలుస్తదన్నారు.

Updated Date - 2023-04-24T17:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising