TS News: మెదక్‌లో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు పైలెట్లు సజీవదహనం
ABN, First Publish Date - 2023-12-04T11:20:33+05:30
Telangana: జిల్లాలోని తూప్రాన్ శివారులో గల టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో శిక్షణ విమానం కూలింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం పూర్తిగా దగ్ధమైంది.
మెదక్: జిల్లాలోని తూప్రాన్ శివారులో గల టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో శిక్షణ విమానం కూలింది. భారీగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సజీవదహనం అయ్యారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి. ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్‌గా గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానం దుండిగల్ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన శిక్షణ విమానంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే దుండిగల్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్లే విమానం కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో ఒకరు అభిమన్యు రాయ్‌గా గుర్తించగా.. మరొకరు వియత్నాంకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఘటన స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-12-04T11:29:33+05:30 IST