ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Errabelli: మంత్రి ఎర్రబెల్లి సంచలన కామెంట్స్.. ఆ నియోజకవర్గంలో వార్‌ వన్‌ సైడే..

ABN, First Publish Date - 2023-08-29T12:51:04+05:30

ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌గా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ములుగు: ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌గా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) అన్నారు. బడే నాగజ్యోతి(Bade Nagajyoti) ఎమ్మెల్యేగా విజయం సాధించి తీరుతారని అన్నారు. ములుగు లోని లీలా గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్‌ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. దయాకర్‌రావుతోపాటు గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌, రెడ్కో చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. దయాకర్‌రావు మాట్లాడుతూ పేదల కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర నాగజ్యోతి కుటుంబానిదన్నారు. అందుకే గుర్తించిన సీఎం కేసీఆర్‌(CM KCR) ఆమెకు టిక్కెట్‌ కేటాయిస్తున్నారని అన్నారు. సర్వేలన్నీ అనుకూలంగా వచ్చాయని, నాగజ్యోతి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ములుగు టిక్కెట్‌ను చాలామంది ఆశించారని, వారందరికీ అధిష్ఠానం న్యాయం చేస్తుందని తెలిపారు. కేసీఆర్‌ చొరవతోనే అజ్మీరా చందూలాల్‌ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో మంత్రి కాగలిగారన్నారు. ఆయనకు మెరుగైన వైద్యం కోసం అమెరికా నుంచి డాక్టర్లను రప్పించారని గుర్తు చేశారు. చందూలాల్‌ కుటుంబంపై పార్టీకి అభిమానం ఉందన్నారు. పార్టీకి వారు ద్రోహం చేయొద్దని అన్నారు. మీకేం కావాలో పార్టీని అడగండన్నారు. చందూలాల్‌, జడ్పీ చైర్మన్‌ జగదీశ్‌ మరణం పార్టీకి తీరని లోటని, అయినా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని గెలిపించుకోవా లన్నారు. కాంగ్రెస్‌ బోగస్‌ పార్టీ అని, ఆ నాయకులంతా బోగస్‌గాళ్లని వ్యాఖ్యానించారు. పోడుభూములకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి, రైతుబంధు, బీమా, మిషన్‌ భగీరథ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో వందెకరాలు కొనొచ్చు అని పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారని గుర్తు చేశారు. తెలంగాణలో భూముల ధరలతోపాటు అభివృద్ధి, సంక్షేమం పరుగులుపెడుతోందన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్‌(Minister Satyavathy Rathore) మాట్లాడుతూ.. ఒకేసారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్‌ చరిత్ర సృష్టించారన్నారు. పట్టుమని పది మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నాయని వ్యాఖ్యానించారరు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ ములుగు ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఘననీయంగా అభివృద్ధి చెందిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీ ఎన్నికల్లో 32వేల ఆధిక్యం వచ్చిందని తెలిపారు. ములుగులో ఓటడిగే హక్కు కాంగ్రెస్‌, బీజేపీలకు లేదని, నాగజ్యోతి గెలుపు కోసం కార్యకర్తలు కార్యోణ్ముఖులు కావాలని కోరారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వేరే పార్టీ వాళ్లు బొట్టు పెడతారు.. నోటు ఇస్తారు.. తీసుకోండి కానీ, ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయాలని కోరారు. ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి మాట్లాడుతూ తాను చిన్ననాటినుంచి కష్టాలు పడుతూ పెరిగానని, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకున్నానని అన్నారు. కన్నవారి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చానని, అతిచిన్న వయస్కురాలైన తనకు టిక్కెట్‌ ఇచ్చి కేసీఆర్‌ ఆశీర్వదించారని కొనియాడారు. ములుగు ప్రాంత అభివృద్ధికోసం తనను గెలిపించాలని కొంగుపట్టి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-29T12:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising