ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HarishRao: కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష.. వాటి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు

ABN, First Publish Date - 2023-03-17T18:46:13+05:30

తెలంగాణ రాష్ట్రంలో కరోనా (Corona) పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా (Corona) పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉందామని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాక్సిన్ (covid vaccine) తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని హరీష్‌రావు తెలిపారు. అర్హులైనవారు వ్యాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని, అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో వాక్సిన్ అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణకు మరిన్ని వ్యాక్సిన్‌ డోసులు సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

ఇటీవల హరీష్ రావు మాట్లాడుతూ వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 2790కి పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలు.. ఆనాడు మూడు ఏర్పాటు చేస్తే, తాము ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే 5 మెడికల్ కాలేజీలు వస్తాయని కలలో అయినా అనుకున్నారా.. ములుగు, సంగారెడ్డిలో తమ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తామని ఒక్కటి కూడా ఇవ్వలేదని... దీనిపై నాటి మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి లేఖలు కూడా రాశారని మంత్రి గుర్తుచేశారు.

కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలు ప్రారంభించారని తెలిపారు. బీబీ నగర్ ఎయిమ్స్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరని... విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేసే అవకాశం కల్పించామని తెలిపారు. అన్ని జిల్లాల్లో పారామెడికల్ కోర్సులు ప్రారంభిస్తున్నామన్నారు. మెడికల్, నర్సింగ్‌తో పాటు పారామెడికల్ కాలేజీలు వస్తాయని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడే ఎయిర్ సాంప్లార్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడుతున్నామని చెప్పారు. 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ నెల రోజుల్లో పూర్తి చేసి, మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా చేస్తామని అన్నారు. ఈ ఏడాదిలోనే మెదక్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిల్మ్‌నగర్ పీహెచ్‌సీ కొత్త భవనం మంజూరు చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-17T18:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising