Seethakka: మంత్రి అయ్యాక తొలిసారి నియోజకవర్గానికి సీతక్క.. ఘన స్వాగతం పలికిన ప్రజలు
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:31 PM
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ములుగు(Mulugu) నియోజకవర్గానికి వచ్చారు సీతక్క(Minister Seethakka).
ములుగు: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ములుగు(Mulugu) నియోజకవర్గానికి వచ్చారు సీతక్క(Minister Seethakka). ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ములుగు జిల్లా మహ్మద్ గౌస్ పల్లి వద్ద ఆమెకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అక్కడి నుంచి గట్టమ్మ దేవాలయం వరకు 15 కి.మీ.ల మేరు ఆమె ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. గట్టమ్మను దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మేడారం(Medaram) వెళ్లారు. మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం..
పర్యటన సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. "నేను ఏ స్థాయిలో ఉన్నా ములుగుకు ఆడబిడ్డనే. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. గ్రామాలాభివృద్ధికి కృషి చేసి నా శాఖకు వన్నెతెస్తా. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలు మాత్రమే అభివృద్ధి చెందాయి.
రాబోయే కాలంలో కేంద్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి" అని అన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 01:40 PM