ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం

ABN, First Publish Date - 2023-02-16T16:41:11+05:30

మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తీరుపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) అసహనం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తీరుపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) అసహనం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ (Jubilee Hills, Banjara Hills)లో ఇళ్ల స్థలాలు ఇచ్చి కిన్నెరమెట్ల మోగిలయ్య (Kinnera Metla Mogulaiah)కు బీఎన్‌రెడ్డిలో స్థలం కేటాయించడంపై బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారులకు కూడా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాలరాజు తెలిపారు.

బంజారాహిల్స్‌ లేదా జూబ్లీహిల్స్‌లో ఇళ్ల స్థలాలు

అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ (Telangana) ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ (Gold medal)ను సాధించిన నిఖత్‌ జరీన్‌ (Nikhat Zari)కు, జర్మనీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ షూటింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ను సాధించిన ఇషా సింగ్‌లకు.. ఒక్కొక్కరికి రూ.2 కోట్ల చొప్పున నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్‌ లేదా జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి బహుమతి

కిన్నెరమెట్ల మొగిలయ్యకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.కోటి నగదు పురస్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో మొగిలయ్య కోరుకున్నట్లుగా హైదరాబాద్‌ శివారు బీఎన్‌ రెడ్డినగర్‌ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చదవండి

చేతిలో డబ్బు లేక బిడ్డ మృతదేహాన్ని 120 కి.మీ మేర...

Updated Date - 2023-02-16T16:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising