ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ABN, First Publish Date - 2023-03-07T16:56:22+05:30

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. నవీన్కుమార్, రచయిత, సీఎం ఓఎస్డీగా పనిచేస్తున్న దేశపతి శ్రీనివాస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. రచయిత, సీఎం ఓఎస్డీగా పనిచేస్తున్న దేశపతి శ్రీనివాస్ (Deshapati Srinivas), అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి (Challa Venkatrami Reddy)తోపాటు నవీన్కుమార్ పేర్లను సీఎం ప్రకటించారు. ఈనెల 9న అభ్యర్థులు నామినేషన్లు (Nominations) వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది.

కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కోటాలో నల్లగొండ, నిజామాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, వుల్లోల్ల గంగాధర్‌ గౌడ్‌, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌ల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు. 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్‌ అనంతరం అదే రోజు కౌంటింగ్‌ ఉంటుంది.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రాజకీయ అవసరాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ద్వారా పార్టీకి కలిగే ప్రయోజనాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, మే చివరిలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌ల పదవీకాలం కూడా పూర్తి కానుంది. ఈ రెండు స్థానాల భర్తీకి సంబంధించి గడువు ముగిసేలోపు ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు.

Updated Date - 2023-03-07T18:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising