ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Raja singh: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్..

ABN, First Publish Date - 2023-10-01T10:57:03+05:30

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోదీని కలవాలని అన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎందుకు అడగటం లేదు?.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోదీని కలవాలని అన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎందుకు అడగటం లేదు?.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ముఖం చూపించుకోలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వేసి తెలంగాణ ప్రజల్లో అభాసుపాలు కాకండి అంటూ హితబోధ చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్‌లు వెన్నుపోటు పార్టీలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.


మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ పోస్టర్లు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ మరోసారి వెలిశాయి. హైదరాబాద్‌లో పోస్టర్లు కలకలం రేపాయి. మోదీకి మహబూబ్‌నగర్‌లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్ల సారాంశంగా ఉంది. కాగా ప్రధాని మోదీ ఈ రోజు (ఆదివారం) మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయమై జరిగిన అన్యాయంపై ఈ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు వేశారు. తెలంగాణ మీద మోడీది సవతితల్లి ప్రేమ అంటూ విమర్శించారు.

Updated Date - 2023-10-01T10:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising