ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Vanama: 25రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌.. మళ్లీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తా..

ABN, First Publish Date - 2023-08-17T11:34:00+05:30

మరో 25 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి

కొత్తగూడెం, (ఆంధ్రజ్యోతి): మరో 25 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందించాలని నియోజకవర్గ అ భివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారా రూ. 3వేల కోట్ల నిధులు మంజూరు చేయించానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(MLA Vanama Venkateswara Rao) తెలిపారు. బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్షించారు. ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి తనకు గ్రీన్‌సిగ్నల్‌ లభించాయని, మళ్లీ కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదం, దేవుడి దయ తనకు ఉందని అందుకే న్యాయం గెలిచిందన్నారు. ఎమ్మెల్యే అనర్హత విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో తనకు స్టే వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో మాట్లాడానని ఈ సందర్భంగా కొత్తగూడెం నుంచి తనను పోటీ చేయాలని కూడా హామీ ఇచ్చి ఆదేశించారని తెలిపారు.

నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశానని, అభివృద్ధి పనులు పూర్తైవుతున్నాయని మిగిలిన పనులన్ని కూడా పెండింగ్‌ లేకుండ వేగవంతంగా అధికారులు పూర్తి చేసి ప్రజలకు అందించాలన్నారు. పాల్వంచ పట్టణంలో వందపడకల సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి నిర్మించామని దానిని వెంటనే ప్రారంభించాలని వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీష్ రావును ఆదేశించినట్లు తెలిపారు. పాల్వంచ, కొత్తగూడెం(Palvancha, Kothagudem) మున్సిపాలిటీలకు నిధులు కూడా మంజూరు చేయించానని, కొత్తగూడెంకు రూ.115కోట్లు, పాల్వంచకు రూ.100కోట్లు మంజూరు చేసిన పనులు వెంటనే జరిపించాలన్నారు. పనులు ప్రారంభించకుంటే సంబంధిత కాంట్రాక్టర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత కమిషనర్లను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, జడ్పీవైస్ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌, ఎంపీపీ భూక్యా సోనా, బాదావత్‌ శాంతి, జడ్పీ సీఈవో విద్యాలత, మున్సిపల్‌ కమీషనర్‌ రఘు, డాక్టర్‌ రవి బాబు, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ కొత్వాల శ్రీనివాస్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-17T11:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising