MP Ranjith: కేసీఆర్‌కు పిండం పెడతా అంటావా.. రేవంత్ ఖబడ్దార్
ABN, First Publish Date - 2023-08-10T14:01:14+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. కేసీఆర్‌కు పిండం పెడతా అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ నిక్కర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రేవంత్ పిచ్చి మాటలు మానుకోవాలని హితవుపలికారు. రాజకీయంగా ఫైట్ చేయాలని.. అంతే కానీ మాటలు సరికావన్నారు. అలాగే హోంమంత్రి సబ్సీడీలు ఇవ్వమని.. రైతులను బలోపేతం చేస్తా అన్నారని.. రైతులకు అండగా నిలిచింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఇంటింటికి నీరు ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు. పార్లమెంట్‌కు నిశికాంత్ దూబే తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. ఆర్థిక మంత్రి మంచి ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశాల గురించి మట్లాడలేరా అని ప్రశ్నించారు. దేశానికి వృద్ధికి సహకారం అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం గురుంచి కూడా ఆర్ధికమంత్రి పార్లమెంట్‌కు చెప్పాలని ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2023-08-10T14:01:14+05:30 IST