Peddagutta Jatara: బోనాల సమర్పించి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
ABN, First Publish Date - 2023-02-06T10:14:09+05:30
తెలంగాణలోనే రెండో అతిపెద్ద దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర వైభవంగా జరుగుతోంది.
సూర్యాపేట: తెలంగాణ (Telangana)లోనే రెండో అతిపెద్ద దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర (Duraj Palli Lingamantula Swami Pedgattu Jatara) వైభవంగా జరుగుతోంది. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఓ లింగా.... ఓ లింగా నామస్మరణతో పెద్దగుట్ట మారుమ్రోగుతోంది. రాత్రి నుంచి గుడి చుట్టూ భక్తులు మందగంపల ప్రదర్శన చేశారు. ఈ రోజులు ఉదయం నుంచి భక్తులు (Devotees)... బోనాలు సమర్పించి గొర్రెలు, మేకలు బలి ఇచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు పెద్దగట్టుపై దట్టంగా పొగమంచు వ్యాపించింది. ఈనెల 5 నుంచి 9 వరకు జాతర జరుగనుంది. జాతర సందర్భంగా ఈరోజు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వ అధికారులు సెలవు ప్రకటించారు. జాతర సందర్భంగా 5 నుంచి హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. హైదరాబాద్ - విజయవాడ వైపు వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద ఉన్న ఖమ్మం వైపు వెళ్లే 365 బీబీ బైపాస్ మీదుగా నామవరం, గుంజలూరు స్టేజ్ నుంచి కోదాడ వైపు మళ్లించారు. జాతర సందర్భంగా మొత్తం 1850 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. 60 సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-02-06T10:14:11+05:30 IST