ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

ABN, Publish Date - Dec 25 , 2023 | 11:47 AM

నల్లగొండ: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ః తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు.

నల్లగొండ: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ః తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.

పూర్తి వివరాలు..

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున నిడమనూరు మండలం, వేంపాడు సమీపంలో లారీ, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ఘటన దగ్గరకు టాటా ఏస్ వాహనం వెళ్తున్న క్రమంలో ఈ వాహనాన్ని మరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా కొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడవత్ నాగరాజు (28) మృతి చెందాడు.

మృతులు వీరే...

1. రమావత్ సేవల నాయక్ (20) (శివ నాయక్)

2. బలుగూరి సైదులు (55)

3. మూడవత్ బుజ్జి (40)

4. రామావత్ పాండు (45)

5. రమావత్ గణ్యా(48)

6.మూడవత్ నాగరాజు (28)

Updated Date - Dec 25 , 2023 | 11:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising