Manda Krishna: కేసీఆర్ మాదిగలను వంచించారు
ABN, First Publish Date - 2023-07-01T17:59:39+05:30
తెలంగాణలో అతిపెద్ద జనాభా ఉన్న మాదిగలను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు న్యాయం జరగడం లేదని మందుల సామేల్ రాజీనామా చేయడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ మాదిగలను వంచిస్తున్నారు.
సూర్యాపేట: తెలంగాణలో అతిపెద్ద జనాభా ఉన్న మాదిగలను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు న్యాయం జరగడం లేదని మందుల సామేల్ రాజీనామా చేయడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ (CM KCR) మాదిగలను వంచిస్తున్నారు. కేబినెట్‌లో మాదిగలకు సరైన ప్రాతినిధ్యం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మాదిగలను వంచిస్తున్నాయి. చైతన్యంతో మాదిగలంతా ఒక్కటైతే ఏ పార్టీలైనా గుర్తిస్తాయి. మహాజన సోషలిస్టు పార్టీ మాదిగలను చైతన్యం చేసే దిశగా రాజకీయంగా ముందుకు సాగుతాం.’’ అని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
Updated Date - 2023-07-01T17:59:39+05:30 IST