TS NEWS: సూర్యాపేటలో ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2023-09-10T21:56:27+05:30
జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట(Suryapet) జిల్లాలోని గరిడేపల్లి మండలం కల్మలచెరువు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
సూర్యాపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట(Suryapet) జిల్లాలోని గరిడేపల్లి మండలం కల్మలచెరువు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కల్మలచెరువుకు చెందిన బిల్లా మనిషా(24), గోలి చంద్రమ్మ(28) మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు, గాయాలయిన వారిని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముత్యాలమ్మ పండుగలో భాగంగా వనవాసయాత్ర ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 15 మంది గ్రామస్తులు ఉన్నారు. డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-09-10T21:56:27+05:30 IST