ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC పేపర్‌ లీకేజీ స్కామ్‌లో మరో ట్విస్ట్

ABN, First Publish Date - 2023-03-22T20:17:13+05:30

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు (TSPSC Paper Leak Case)లో కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: TSPSC పేపర్‌ లీకేజీ స్కామ్‌లో మరో ట్విస్ట్.. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు (TSPSC Paper Leak Case)లో కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజశేఖర్‌ స్నేహితుడు సురేష్‌ పాత్రపై అనుమానాలు ఉన్నట్లు సిట్ అధికారులు తెలిపారు. TSPSC నుంచి పేపర్‌ తీసుకొచ్చి సురేష్‌కు ఇచ్చినట్లు గుర్తించారు. 9 మంది నిందితులను 7 గంటలపాటు ప్రశ్నించిన సిట్.. సురేష్‌ ఎంత మందికి పేపర్‌ ఇచ్చాడన్నదానిపై ప్రశ్నించింది. రేణుక, నీలేష్‌, గోపాల్‌ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై, రాజశేఖర్‌ వాట్సాప్‌ చాటింగ్‌పైనా సిట్ అధికారులు ఆరా తీశారు. పలు అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సైబర్‌క్రైమ్‌ టెక్నికల్‌ టీమ్‌ తెలిపింది. TSPSCలో పనిచేస్తున్న 42 మందికి సిట్‌ నోటీసులు ఇచ్చింది. TSPSCలో పనిచేస్తున్న వారందరినీ విచారిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ చెప్పింది. ప్రవీణ్‌, రాజశేఖర్‌తో సంబంధాలున్న వారందరిపై విచారణ చేపట్టారు. ఇప్పటికే శంకర్‌లక్ష్మిని రెండుసార్లు, టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్నవారందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ (TSPSC Paper leakage)పై మంగళవారం హైకోర్టు (Telangana High Court) లో విచారణ మొదలైంది. ఈ కేసును సీబీఐ (CBI) లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారించాలంటూ అభ్యర్థులతో పాటు ఎన్ఎస్‌యుఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరుపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా (Supreme Court Senior Counsel Vivek Tanka) వాదనలు వినిపిచారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరు మాత్రమే నిందితులు అని ఐటీ మినిస్టర్ కేటీఆర్ (IT Minister KTR) చెబుతున్నారని... ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఒకే మండలంలో 20 మందికి మంచి మార్కులు వచ్చాయని... దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే నిజనిజాలు బయట పడతాయని తన్క వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్‌పీఎస్సీ బోర్డ్ రద్దు చేసిందన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీలో సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఐటీ మినిస్టర్ స్వయాన కేవలం ఇద్దరు నిందితులకు మాత్రమే సంబంధం ఉంది అని చెప్పారని... కేసు మొదటి దశలోనే ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉంది అని ఎలా చెపుతారని ప్రశ్నించారు.

ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదు, సీబీఐ ద్వారానే విచారణ జరగాలని కోర్టుకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌ సైట్‌లో ఎందుకు పెట్టలేదని అడిగారు. టీఎస్‌పీఎస్సీ అంత రహస్యంగా అభ్యర్థుల వివరాలు ఎందుకు ఉంచుతోందని అన్నారు. ఒకే మండలం నుంచి 20 మంది అభ్యర్థులు అత్యధిక మార్కులతో క్వాలిఫై అయ్యారని... ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ, లేక ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని వినతి చేశారు. గతంలో వ్యాపమ్ స్కాంలో సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించిందని చెబుతూ... మధ్యప్రదేశ్ వ్యాపమ్ స్కాం జడ్జిమెంట్ కాపీని వివేక్ ధన్కా హైకోర్టుకు సమర్పించారు.

Updated Date - 2023-03-22T20:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising