ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: రేవంత్ రెడ్డికి సెక్యూరిటీని తొలగించారా..? గన్‌మెన్లే డుమ్మా కొట్టారా..?

ABN, First Publish Date - 2023-08-17T21:01:22+05:30

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది లేకుండానే ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం నుంచి రేవంత్‌కు భద్రతగా గన్‌మెన్లు వెళ్లడం లేదని సమాచారం. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్‌ పోలీసుల్ని ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెడ్‌ డైరీలో మీ పేర్లు రాసి పెడతా. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం. అసలు మిత్తితోని చెల్లిస్తాం’’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది లేకుండానే ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం నుంచి రేవంత్‌కు భద్రతగా గన్‌మెన్లు వెళ్లడం లేదని సమాచారం. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్‌ పోలీసుల్ని ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెడ్‌ డైరీలో మీ పేర్లు రాసి పెడతా. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం. అసలు మిత్తితోని చెల్లిస్తాం’’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే గన్‌మెన్లు రేవంత్ రెడ్డికి కల్పించాల్సిన భద్రతా విధులకు డుమ్మా కొట్టినట్లుగా తెలిసింది. రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో భద్రతను కేసీఆర్ సర్కార్ తొలగించిదనే మరో వాదన కూడా వినిపిస్తోంది. గతంలో 4+4 ఉండే సెక్యూరిటీని తర్వాత 2+2కి కుదించిందని.. ఇప్పుడు పూర్తిగా తొలగించిందని ప్రచారం జరుగుతోంది.


రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో కూడా తన యాత్రకు పోలీసులు తగిన స్థాయిలో భద్రత కల్పించడం లేదని ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అదనపు పోలీసులతో భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ సందర్భంలో పిటిషన్‌ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకుల నుంచి తనకు ముప్పు పొంచి ఉన్నదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు కేసీఆర్ సర్కార్‌ను అప్పట్లో ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. పోలీసులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు వై. గోపిరెడ్డి స్పందించారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగం అని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నడుచుకుంటుందన్నారు. పోలీసులను తమ పని చేసుకోనివ్వకుండా వచ్చేది తమ ప్రభుత్వం అనీ, మీ సంగతి చూస్తామని బెదిరించడం ఏరకమైన రాజనీతి అని ప్రశ్నించారు. అసలు రెడ్‌ డైరీ అంటే ఏంటి? అదేమైనా మీ సొంత రాజ్యాంగమా అని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చట్టవ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని గోపిరెడ్డి తేల్చి చెప్పారు. కాగా, రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ భద్రా రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జి. కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-08-17T21:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising