ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డాం

ABN, First Publish Date - 2023-10-30T15:57:19+05:30

కామారెడ్డి: గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

కామారెడ్డి: గతంలో కరెంట్ (Current), నీళ్ళు (Watrer) లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణ (Telangana) ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని బీఆర్ఎస్ అధినేత (BRS Chief), ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా, జుక్కల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ... జుక్కల్‌లో మంచి నీళ్ళ కోసం బాధ పడ్డామని, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ సమస్య లేకుండా నీళ్ళ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మంచీ.. చెడును చూసి.. ఆలోచించి ఓటేయ్యాలని సూచించారు.

మూడు రాష్ట్రాల సంగమ ప్రాంతమీదని, మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నప్పటికీ సంక్షేమం లేదని, కర్ణాటకలో సరిగా కరెంట్ ఇవ్వడంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంట్‌కే గొప్ప అంటున్నారని, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పాలన్నారు. అంజిమాన్‌లో లోన్‌లు ఉంటే ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారని, రైతు భీమా చేశామని, బాధితులకు వారం రోజుల్లో రూ.5 లక్షలు అందిస్తున్నామని, అదేవిధంగా రెండు దఫాలుగా రూ. 37 వేల కోట్ల రుణ మాఫీ చేశామని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రైతు బంధు ఆపామని, ఎన్నికలు అవ్వగానే అకౌంట్లలో వేస్తామని కేసీఆర్ అన్నారు. లెండి ప్రాజెక్ట్ ద్వారా అధికారంలోకి రాగానే నీళ్ళు అందిస్తామని, నాగ మడుగు ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. గతంలో జుక్కల్‌కు పిల్లనివ్వలంటే భయ పడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దళిత బంధు పథకంను భారత దేశంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని, దఫాలుగా అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. జుక్కల్‌లో పీజీ, డిగ్రీ కాలేజ్ వచ్చిందని, కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రం అభివృద్ది చెందలేదన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 18 వేలతో దేశంలో అభివృద్ధిలో ముందున్నామన్నారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 22 వందల యూనిట్లతో దేశంలోనే నెంబర్ వన్‌లో ఉన్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-30T15:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising