Master planపై ముదురుతున్న వివాదం.. కామారెడ్డిలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2023-01-05T16:13:03+05:30
కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువ రైతు రాములు (Ramulu) ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ ముట్టడికి
కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువ రైతు రాములు (Ramulu) ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్(Master plan)తో భూములు నష్టపోయిన రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. చర్చి గ్రౌండ్ నుంచి భూ బాధితుల ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీకి భారీగా అన్నదాతలు తరలివచ్చారు. మరోవైపు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
రాజీనామా..
మరోవైపు యువ రైతు రాములు మృతికి నిరసనగా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. సర్పంచ్ సహా తొమ్మిది మంది వార్డు సభ్యులు రాజీనామా చేశారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-01-05T16:15:12+05:30 IST