ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy Master Plan ప్రతిపాదనపై కలెక్టర్ వివరణ

ABN, First Publish Date - 2023-01-07T14:10:17+05:30

కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరణ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ (Kamareddy New Master Plan) ప్రతిపాదనపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ (Collector Jitesh V Patil) వివరణ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అపోహలు నమ్మి ఆందోళన చెందుతున్నారని... అందరి అభ్యంతరాలు తీసుకుంటామని తెలిపారు. ఎవరి భూములూ నష్టపోరని స్పష్టం చేశారు. ఏదైనా ఇబ్బందులు, అభ్యంతరాలు ఇస్తే రికార్డు చేస్తామని... అందరికీ సమాధానాలు ఇస్తామని చెప్పారు. ఇది ముసాయిదా మాత్రమే అని... ఫైనల్ చేయడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. 2000లో పాత మాస్టర్ ప్లాన్ తయారైందని... అప్పుడు కూడా ఇలాంటి జోన్లు పెట్టారని...వాటిలోని భూములను ఎవరూ డిస్టర్బ్ చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. నూతన మాస్టర్ ప్లాన్‌పై ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని.. అన్నీ పరిశీలిస్తామని తెలిపారు. జనాల అభిప్రాయాలపై చర్చ ఉంటుందని... తర్వాత పై స్థాయిలో ఫైనల్ అవుతుందన్నారు. ఇండస్ట్రియల్ జోన్ కింద మార్క్ అయి ఉంటుందని తెలిపారు. భూమికి, భూ యజమానులకు ఎలాంటి నష్టం ఉండదని తేల్చిచెప్పారు. ఈనెల 11 వరకు అభ్యంతరాలు ఇవ్వచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.

Updated Date - 2023-01-07T14:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising