Sad Incident: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. అప్పుడే పుట్టిన పసికందులను..
ABN, First Publish Date - 2023-09-05T21:37:42+05:30
నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District ) దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందులను ఓ ముఠా విక్రయించబోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆ ముఠా గుట్టురట్టు చేశారు.
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District ) దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందులను ఓ ముఠా విక్రయించబోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆ ముఠా గుట్టురట్టు చేశారు. పిల్లలు పుట్టని వారిని ఆసరాగా తీసుకొన్న ముఠా.. వారికి లక్షల్లో పసికందులను విక్రయిస్తోంది.శిశు విక్రయ కేసులో ఓ ఆశావర్కర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల వెల్లడించారు. మీడియా సమావేశంలో ఏసీపీ కిరణ్ వివరాలు వెల్లడించారు. కుమార్, నరహరి అనే నిందితులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు పంపించారు. శిశు విక్రయాలపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీసులు హెచ్చరించారు.
Updated Date - 2023-09-05T21:37:42+05:30 IST