ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: కామారెడ్డి జిల్లాలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం.. తల్లిదండ్రుల ఆందోళన

ABN, First Publish Date - 2023-09-22T20:45:01+05:30

జిల్లాలో కొన్ని పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యత లేని, పాచిపోయిన ఆహారం(Quality, Spoiled Food) పెడుతున్నారు. దీంతో విద్యార్థులు తరచూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

కామారెడ్డి: జిల్లాలో కొన్ని పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యత లేని, పాచిపోయిన ఆహారం(Quality, Spoiled Food) పెడుతున్నారు. దీంతో విద్యార్థులు తరచూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో పురుగుల అన్నం, నీళ్లచారు పెడుతుండడంతో విద్యార్థులు అస్వస్తతకు గురవుతున్నారు. బీబీపేట మండలం యాడారం ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో వడ్డించిన అన్నంలో పురుగులు, పూర్తిగా నీళ్లతో కూడిన చారు వడ్డిస్తున్నారు. కడుపు మాడ్చుకోలేక ఈ ఆహారం తిన్న కొంతమంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరికొంతమంది పురుగులను గమనించి భోజనాన్ని మురికి కాలువలో పాడేశారు. విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులను, వంట నిర్వాహకులను నిలదీశారు. వెంటనే వంట నిర్వాహకులను తొలగించాలంటూ పాఠశాల ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో తరచూ ఇలాంటి ఆహారాన్ని పెడుతున్న ప్రిన్సిపాల్ ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు పాఠశాలలో తనిఖీ నిర్వహించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-22T20:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising