Nirmal: కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యుల హుకుం..దంపతుల ఆత్మహత్యాయత్నం..
ABN, First Publish Date - 2023-03-03T13:03:50+05:30
రూ.5లక్షలు(Rs.5 lakhs) చెల్లించాలని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యుల హుకుం జారీతో మనస్తాపానికి గురైన దంపతులు ..
నిర్మల్: రూ.5లక్షలు(Rs.5 lakhs) చెల్లించాలని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యుల హుకుం జారీతో మనస్తాపానికి గురైన దంపతులు ఆత్మహత్యాయత్నం (suicide attempt)చేశారు. పదే పదే డబ్బులు చెల్లించాలని ఒత్తడి తేవడంతో పురుగుల మందు తాగిన దంపతులు చంద్రశేఖర్, లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బేస్తవారిపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..చింతకుంటవాడలో కొన్ని రోజుల క్రితం దంపతులు కొత్తగా దుకాణం నిర్మించుకున్నారు. అయితే..కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రూ.5 లక్షలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో బాధితులు ఒత్తడిని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు దంపతులు తెలిపారు. కాలనీ అభివృద్ధి కమిటీ తీరుకు నిరసనగా షాపులను వ్యాపారస్థులు మూసివేసి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-03-03T13:03:50+05:30 IST