TS News: చదువుకోమని మందలించడంతో యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-01-28T11:20:27+05:30
జిల్లాలోని కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చ
కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చదువుకోమని మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిదాస్ కుటుంబ సభ్యులు గత రెండు నెలలుగా కామారెడ్డి మండలం రాఘవపూర్ వద్ద ఇటుక బట్టిలో కూలీలుగా పనిచేస్తున్నారు. రోహిదాస్ కుమారుడు నివర్తి స్వగ్రామమైన మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా మంగ్యాల గ్రామంలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో నివర్తి ఈనెల 20న రాఘవపూర్‌లోని తల్లిదండ్రుల దగ్గర వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి చదుకోమని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-01-28T11:20:28+05:30 IST