TS NEWS: నిజామాబాద్ జిల్లాలో విషాదం.. కరెంట్ షాకుతో చిన్నారి మృతి
ABN, First Publish Date - 2023-10-02T21:45:02+05:30
జిల్లాలో విషాదం నెలకొంది. నందిపేటలో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది. ఓ సూపర్ మార్కెట్‌లో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది.
నిజామాబాద్: జిల్లాలో విషాదం నెలకొంది. నందిపేటలో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది. ఓ సూపర్ మార్కెట్‌లో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది. ఫ్రిజ్ పట్టుకోగానే విద్యుత్‌షాక్‌తో చిన్నారి (4) మృతిచెందింది. తండ్రితో కలిసి సూపర్ మార్కెట్‌కు చిన్నారి వెళ్లింది. చాక్లెట్ కోసం ఫ్రిజ్ డోర్ తీయడంతో రిషితకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో చిన్నారిని స్థానిక ఆస్పత్రికి బాలిక తండ్రి తీసుకెళ్లాడు. చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. షాపింగ్ మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-10-02T21:45:02+05:30 IST