Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనా స్థలానికి టీడీపీ బృందం
ABN, First Publish Date - 2023-06-03T21:49:50+05:30
ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) ఘటనా స్థలానికి టీడీపీ (TDP) బృందం వెళ్లింది.
హైదరాబాద్: ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) ఘటనా స్థలానికి టీడీపీ (TDP) బృందం వెళ్లింది. కటక్, భువనేశ్వర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి వివరాలను ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రెండు ఆస్పత్రుల్లో తెలుగువారు లేరని నిర్ధారణకు వచ్చారు. తెలుగువారి వివరాలను టీడీపీ బృందం తెలుసుకుంటుంటోంది.
సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది. (Signalling failure caused Odisha train accident) రైలు నంబర్ 12841కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇచ్చారు. కానీ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి, అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పిందని ప్రాథమిక నివేదిక (preliminary probe) పేర్కొంది. దీనివల్ల కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, 300కు చేరవచ్చని తెలుస్తోంది.
Updated Date - 2023-06-03T21:56:27+05:30 IST