ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయ్... ఉల్లిగడ్డ @ 80

ABN, First Publish Date - 2023-10-31T13:19:39+05:30

రెండు నెలల క్రితం రూ.100లకు 6 కేజీలు లభించిన ఉల్లిగడ్డ(Onions) నేడు కేజీన్నర మాత్రమే వస్తున్నాయి.

ఖమ్మం: రెండు నెలల క్రితం రూ.100లకు 6 కేజీలు లభించిన ఉల్లిగడ్డ(Onions) నేడు కేజీన్నర మాత్రమే వస్తున్నాయి. సోమవారం నగరంలోని రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.70ల నుంచి రూ.80లు పలికింది. వారం రోజుల క్రితం కిలో రూ.50లు పలికిన ఉల్లి ధర ఒక్కసారిగా కిలోకు రూ.20 నుంచి రూ.30 పెరిగింది. ప్రసుత్తం కిలో రూ.70-80లకు చేరడంతో సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. మంచి క్వాలిటీ ధర కిలో రూ.80లకు చేరడంతో ఉల్లిగడ్డలు ఎక్కువగా వినియోగించే హోటల్స్‌, బిర్యానీ సెంటర్లు, హాస్టల్స్‌ నిర్వాహకులు ఉల్లిగడ్డల వాడకాన్ని భారీగా తగ్గించారు. ప్రూట్‌ సలాడ్‌లలో ఉల్లిపాయ ముక్కలను విరమించి కీరా, క్యారెట్‌, నిమ్మకాయలను మాత్రమే వాడుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మున్ముందు ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఉల్లి పంటసాగు తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గి డిమాండ్‌కు తగినట్టు సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబరు మొదటివారంలో రావాల్సిన కొత్త సీజన్‌ ఖరీఫ్‌ పంట కొంత మేర ఆలస్యం కావడం, పాత పంట నిల్వలు అడుగంటడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం.

Updated Date - 2023-10-31T13:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising