ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaddar: గద్దర్ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-08-06T17:59:11+05:30

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఏపీ సీఎం జగన్‌, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ‌తోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేశినేని చిన్ని, పోతుల బాలకోటయ్య, టీడీపీ నేత జవహర్‌, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఏపీ సీఎం జగన్‌, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ‌తోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేశినేని చిన్ని, పోతుల బాలకోటయ్య, టీడీపీ నేత జవహర్‌, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ, గరికపాటి నరసింహరావు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోశారు: చంద్రబాబు

‘‘ ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి బాధించింది. ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోశారు. గద్దర్ మృతితో ప్రశ్నించే గొంతు మూగబోయింది. పౌరహక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువలేనిది’’. ఇక నారా లోకేష్ స్పందిస్తూ.. ‘‘ ప్రజా గాయకుడి గొంతు మూగబోయింది. తెలంగాణ ఉద్యమ గళం గద్దర్‌’’ అన్నారు.

గద్దర్ పాటలు ఎప్పటికీ స్ఫూర్తి: జగన్

సీఎం జగన్ స్పందన.. ‘‘ బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాటలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి’’. ప్రజా కవి గద్దర్ మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి స్పందన... ‘‘ నీ గానం… తెలంగాణ వేదం. నీ గజ్జె… తెలంగాణ గర్జన. నీ గొంగడి… తెలంగాణ నడవడి. నీ గొంతుక… తెలంగాణ ధిక్కార స్వరం. నీ రూపం… తెలంగాణ స్వరూపం. గద్దరన్నా… నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం. నీ మరణం… నా గుండెకు శాశ్వత గాయం’’.

ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు: బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ స్పందన.. ‘‘ తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’.

ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది: ఆర్ నారాయణమూర్తి

‘‘ ఒక అన్నమయ్య పుట్టారు..దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు... దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు... దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు... దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’’.

Updated Date - 2023-08-06T18:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising