Telangana Results: గురువును మించిన శిష్యుడు.. దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పీకే శిష్యుడు సునీల్ పేరు!
ABN, First Publish Date - 2023-12-03T18:42:25+05:30
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది. స్పష్టమైన మెజారిటీ సాధించి గులాబీ పార్టీని ఇంటికి పంపించింది. కొన్ని నెలల క్రితం మూడో స్థానానికే పరిమితమైన పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారం సాధించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్ (KCR) హ్యాట్రిక్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది. స్పష్టమైన మెజారిటీ సాధించి గులాబీ పార్టీని (BRS) ఇంటికి పంపించింది. కొన్ని నెలల క్రితం మూడో స్థానానికే పరిమితమైన పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారం సాధించింది. కొద్ది నెలల్లోనే అద్భుతంగా పుంజుకుని గులాబీ నేతలను నివ్వెరపరిచింది. కాంగ్రెస్ పార్టీ (Congress) ఇంత బలంగా పుంజుకోవడం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో సునీల్ కనుగోలు (Sunil Kanugolu) ఒకరు. పీకే శిష్యుడిగా రంగ ప్రవేశం చేసిన సునీల్ ప్రస్తుతం గురువు స్థాయికి చేరుకున్నారు (Telangana Results).
కర్ణాటకలో (Karnatka) ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించారని పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని దించడంలో సునీల్‌ది కీలక పాత్ర. ``పే సీఎం`` అంటూ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిపై కాంగ్రెస్ ఒక రేంజ్‌లో విరుచుకుపడడం వెనుక ఉన్నది సునీల్. కర్ణాటకలో సునీల్ పనితీరును గమనించిన కాంగ్రెస్ అధిష్టానం అతడికి ఉన్నత పదవి ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత సునీల్‌ను హైదరాబాద్‌కు పంపించింది. సునీల్ వచ్చేటప్పటికీ బీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ మూడో స్థానంలో డీలా పడినట్టు ఉండేది. సునీల్ తనదైన ప్రణాళికలతో కాంగ్రెస్‌ను పోటీలోకి తెచ్చారు. ప్రభుత్వాన్ని పకడ్బందీగా టార్గెట్ చేసి ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకత ఏర్పడేలా చేశారు.
Telangana Elections: బీఆర్ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది ఈ ఒక్క విషయమేనా..?
ప్రభుత్వ వైఫల్యాలు, కాలేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగడం, బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనని ప్రచారం చేయడం, నిరుద్యోగం.. ఇలా ఎన్నో అంశాలను ప్రజలల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడేలా చేయడంలో సునీల్ సక్సెస్ అయ్యారు. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చిన సునీల్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సునీల్ గతంలో ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) దగ్గర పని చేశారు. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి స్వంతంగా కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో పని చేసి రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం పీకేకు బదులుగా సునీల్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.
Updated Date - 2023-12-03T18:42:27+05:30 IST