Ponguleti: కేసీఆర్.. శ్రీరాముడినే మోసగించారు..
ABN, First Publish Date - 2023-08-11T12:38:54+05:30
సీఎం కేసీఆర్.. సాక్షాత్తు ఆ శ్రీరాముడినే మోసగించారని, భద్రాచలం పుణ్యక్షేత్రంపై తొలినుంచీ ఆయన నిర్లక్ష్య ధోరణితోనే వహిస్తున్నారని
- భద్రాద్రిపై తొలినుంచీ ఆయనది నిర్లక్ష్య ధోరణే..
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం: సీఎం కేసీఆర్.. సాక్షాత్తు ఆ శ్రీరాముడినే మోసగించారని, భద్రాచలం పుణ్యక్షేత్రంపై తొలినుంచీ ఆయన నిర్లక్ష్య ధోరణితోనే వహిస్తున్నారని టీపీసీసీ ప్రచారకమిటీ కో-కన్వీనర్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Former Khammam MP Ponguleti Ponguleti Srinivasa Reddy) మండిపడ్డారు. భద్రాచలంలో గురువారం పలు పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి ఆయన భద్రాచలం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యతో కలిసి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పి రాముడిని సైతం సీఎం కేసీఆర్ మోసగించారని విమర్శించారు. ఏపీ పరిధిలోకి వెళ్లిన ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయించేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపుతామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించి అనంతరం ఆ హామీని విస్మరించారని దుయ్యబట్టారు. గత ఏడాది వచ్చిన గోదావరి వరదల సమయంలో పరామర్శకు వచ్చి రూ.1,000 కోట్తతో భద్రాద్రికి వరద నుంచి పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టడమే కాకుండా 2016 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే విజయం సాధిస్తారని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా భద్రాచలం ఏజెన్సీని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్, డా. తెల్లం వెంకట్రావు, సరెళ్ల నరేష్ అడబాల వెంకటేశ్వరరావు, చింతిరేల రవికుమార్. వసంతాల రాజేశ్వరి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి జడ్పీటీసీ, నలుగురు ఎంపీటీసీలు, ముగ్గురు సర్పంచ్‌లు
దుమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యురాలు తెల్లం సీతమ్మతో పాటు ఎంపీటీసీ సభ్యులు మద్ది రాము, సోడి తిరుపతిరావు, మడకం రామారావు, పూసెం ధర్మరాజు, సర్పంచ్‌లు వర్సా శివరామకృష్ణ, సోందె నాగమణి, మడకం చంద్రశేఖర్‌లు కాంగ్రె్‌సలో చేరారు. అలాగే ఉప సర్పంచ్‌లు తెల్లం రామకృష్ణ, మహేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పూజారి సూర్యచంద్రరావుతో పాటు 24 మంది కాంగ్రె్‌సలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Updated Date - 2023-08-11T12:38:55+05:30 IST