ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Preeti: ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడి..

ABN, First Publish Date - 2023-03-05T22:45:25+05:30

మెడికో ప్రీతి (Medico Preethi) మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌ (Preeti toxicology report)లో విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని, ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వరంగల్‌: మెడికో ప్రీతి (Medico Preethi) మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌ (Preeti toxicology report)లో విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని, ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో విషపదార్థాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ పేర్కొంది. టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్‌కు చేరింది. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. సూసైడ్‌ కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చేపనిలో పోలీసులు ఉన్నారని, హత్యే అని ప్రీతి కుటుంబసభ్యులు, విపక్షాలు ఆరోపిస్తున్నారు.

మెడికో ప్రీతి (Medico Preethi)ది హత్యేనని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పష్టం చేశారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రీతి కేసులో ఆధారాలను తారుమారు చేశారని విమర్శించారు. డెడ్‌బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి ఈ ప్రభుత్వానిదేనన్నారు. ప్రీతి మృతి కేసుపై సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR) ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్‌ డిమాండ్ చేశారు.

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతి కథ విషాదాంతమైంది. ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సీపీఆర్‌ నిర్వహించారు. హైదరాబాద్‌కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్‌ వైద్యులు కూడా సీపీఆర్‌ చేశారు. గురువారం కూడా అదే పరిస్థితి ఉండడంతో ఆమెకు మరో రెండుసార్లు సీపీఆర్‌ నిర్వహించారు. నిమ్స్‌కు తరలించే సరికే ఆమె శరీరంలోని వివిధ అవయవాలు విఫలమయ్యాయని నిమ్స్‌ వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-03-05T23:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising