Naveen Case: సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి... హత్యలో ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసుల ఆరా
ABN, First Publish Date - 2023-03-04T13:53:05+05:30
జిల్లాలోని అబ్దు్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
రంగారెడ్డి: జిల్లాలోని అబ్దు్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు (Naveen Case) లో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితుడు హరిహరకృష్ణ (Accused Hariharakrishna)ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ (Scene reconstruction) చేశారు. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు సీన్ రీకన్‌స్ట్రన్స్‌కు హరిహరకృష్ణను తీసుకెళ్లిన పోలీసులు నాలుగు గంటల తర్వాత అంటే ఉదయం 7:30 గంటలకు ఎల్బీనగర్ ఎస్వోటీ కార్యాలయానికి తీసుకువచ్చారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ముందుగా మూసరంభాగ్‌లోని సోదరి ఇంటికి హరిహరకృష్ణను తీసుకెళ్లారు. అక్కడే హరిహరకృష్ణతో పాటు సోదరిని పోలీసులు ప్రశ్నించారు. మూసరంభాగ్ నుంచి అంబర్‌పేట్‌లోని తిరుమల వైన్స్ వరకు హరిహరను తీసుకువెళ్లారు. అక్కడి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరును హరిహరను అడిగి తెలుసుకున్నారు. హత్య తర్వాత హరిహరకృష్ణ బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకున్నట్లు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే హత్య కేసులో ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. హరిహరను ఎల్బీనగర్ ఎస్వోటీ కార్యాలయానికి తీసుకువచ్చిన పోలీసులు.. నవీన్‌ను అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది అని ఆరా తీస్తున్నారు.
సంచలన విషయాలు వెలుగులోకి...
కాగా... ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్ (Youtube)లో ఎక్కువగా పోస్టుమార్టం వీడియోల (Postmortem videos)ను హరిహర సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. యూట్యూబ్ వీడియోలను చూసి శరీర భాగాలను ఎలా వేరు చేయాలో కూడా తెలుసుకున్నాడు. గుండెను ఎలా బయటకు తీయాలో కూడా సోషల్ మీడియా ద్వారానే నిందితుడు తెలుసుకున్నాడు. ఆ వీడియోలను చూసి నవీన్ తల, గుండె, మర్మాంగాలను వేరు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోస్టుమార్టం నిపుణులు కూడా ఒక్కరే చేయని పనినీ హరిహర మాత్రమే చేశాడా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. హరిహర స్నేహితుడు హాసన్‌ను కూడా పోలీసులు ఈరోజు విచారించే అవకాశం ఉంది.
Updated Date - 2023-03-04T13:53:05+05:30 IST