Naveen Case: ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏంటి?.. నవీన్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్
ABN, First Publish Date - 2023-03-04T09:57:24+05:30
అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ కస్టడీ రెండో రోజు కొనసాగుతోంది.
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు (Naveen Case)లో నిందితుడు హరిహర కృష్ణ (Hariharakrishna) కస్టడీ రెండో రోజు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ (Scene reconstruction) చేపట్టారు. ముందుగా హరిహరకృష్ణను తన సోదరి ఇంటికి తీసుకెళ్లారు. హత్యకేసులో ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవీన్‌ను దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని ఆరా తీస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నవీన్‌ను తీసుకొచ్చింది ఎవరు?.. అక్కడ అతనికి సహకరించింది ఎవరు? అంటూ పలు కోణాల్లో విచారణ చేపట్టారు. నవీన్ హత్య వెనుక యువతి పాత్రపైనా విచారణ బృందం ఆరా తీస్తోంది.
కాగా.. యువతి కోసం స్నేహితుడిని అతికిరాతకంగా చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నల్గొండ ఎంజీ యూనివర్శిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌కు.. అదే కళాశాలలో చదువుతున్న హరిహరకృష్ణతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే వీరిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. విషయం తెలుసుకుని ఇరువురు కొద్దిరోజులుగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో తను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని తప్పించాలని హరిహరకృష్ణ ప్లాన్ చేశాడు. దాని ప్రకారం ఫిబ్రవరి 17న ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. నవీన్‌ను తీవ్రంగా గాయపరిచిన హరిహరకృష్ణ... అతడి గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అత్యంత కిరాతంగా నవీన్ తల, మొండెం వేరు చేశాడు. గుండెను బయటకు తీసి, మర్మాంగాలు కోసేశాడు. పేగుల బయటకు తీసి సైకోలా ప్రవర్తించాడు. ఆపై అక్కడి నుంచి తండ్రి వద్దకు వెళ్లిన హరిహరకృష్ణ హత్య గురించి చెప్పాడు. ప్రియురాలికి కూడా చెప్పడంతో పోలీసుల ఎదుట లొంగిపొమ్మని సూచించింది. చివరకు తండ్రి సూచన మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల వద్ద హరిహరకృష్ణ లొంగిపోయాడు. అయితే తన కుమారుడు మాత్రమే ఈ హత్య చేసి ఉంటాడని తాను అనుకోవట్లేదని హరిహర తండ్రి అంటున్నారు.
Updated Date - 2023-03-04T10:02:07+05:30 IST