ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్ల రాజీనామా

ABN, First Publish Date - 2023-01-19T21:34:40+05:30

కామారెడ్డి (Kamareddy) మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా మున్సిపాలిటీకి చెందిన బీజేపీ (BJP), కాంగ్రెస్‌ కౌన్సిలర్‌లు గురువారం రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: కామారెడ్డి (Kamareddy) మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా మున్సిపాలిటీకి చెందిన బీజేపీ (BJP), కాంగ్రెస్‌ కౌన్సిలర్‌లు గురువారం రాజీనామా చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో ఇండస్ట్రియల్‌, గ్రీన్‌జోన్‌లను 8 గ్రామాలకు చెందిన రైతుల భూముల్లో చేర్చడంతో రైతు జేఏసీ గత 52 రోజులుగా ఆందోళనలు చేపడుతూ వచ్చింది. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా ఈనెల 20వ తేదీ లోపు రాజీనామా చేయాలని రైతు జేఏసీ డిమాండ్‌ చేసింది. దీంతో గత మూడు రోజుల కిందటే బాధిత రైతుల రెండు గ్రామాలైన రామేశ్వర్‌పల్లి, లింగాపూర్‌ వార్డులకు చెందిన ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు సుతారిరవి, కాసర్ల శ్రీనివాస్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వీరి రాజీనామా పత్రాలను గురువారం కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సమక్షంలో అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు పాక జ్ఞానేశ్వరి, మెహరున్నిసా, అన్వర్‌, పాత శివకృష్ణమూర్తిలు రాజీనామా చేసి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి అందజేశారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ బీ ఫాం తీసుకుని పార్టీ గుర్తుమీద గెలిచిన మరో 8 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్‌లు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్నారని.. వారి పదవి కాలం ముగిసే వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే అవుతారని, వారు కూడా రైతులకు మద్దతుగా రాజీనామా చేయాలని షబ్బీర్‌అలీ డిమాండ్‌ చేశారు. మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. వెంటనే మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-01-19T21:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising