కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..?: తలసానికి రేవంత్ కౌంటర్
ABN, First Publish Date - 2023-05-10T14:02:04+05:30
నిన్న సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు.
హైదరాబాద్ : నిన్న సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని రేవంత్ సూచించారు. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్‌లు నమిలే వారు కూడా తన గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదన్నారు. ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా.. ఎవరేం పిసుకుతారో చూద్దాం. కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..? మంత్రిగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేను పీసీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరు’’ అని పేర్కొన్నారు.
కాగా.. నిన్న తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించారో వారికే తెలియాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దేశాన్ని 45-50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి.. పేదలకు రూ.2 వేల పింఛన్, 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిన పాపం కాంగ్రె్‌సదేనని ఆరోపించారు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయ చేయడం తప్ప.. అభివృద్ధి చేశామని ఓట్లడిగే దమ్ము బీజేపీకి లేదని విమర్శించారు. యజ్ఞాలు, యాగాలు చేయడమే కాకుండా.. యాదాద్రి వంటి గొప్ప దేవాలయాన్ని నిర్మించిన కేసీఆర్ కంటే గొప్ప హిందువు దేశంలో ఎవరూ లేరని అన్నారు. ‘‘ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతది’’’ అని పరోక్షంగా రేవంత్‌రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-05-10T14:02:04+05:30 IST