ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharmila: షర్మిల కేసు విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-05-08T17:44:08+05:30

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల కేసు విచారణ వాయిదా పడింది. జూన్ 5వ తేదీకి నాంపల్లి కోర్టు విచారణ వాయిదా వేసింది. గతనెల 24న ఎస్ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఘటనలో బంజారాహిల్స్ పీఎస్లో షర్మిలపై కేసునమోదు చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ఏప్రిల్ 24న షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల (Sharmila) కేసు విచారణ వాయిదా పడింది. జూన్ 5వ తేదీకి నాంపల్లి కోర్టు (Nampally Court) విచారణ వాయిదా వేసింది. గతనెల 24న ఎస్ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఘటనలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ (Banjara Hills Police Station)లో షర్మిలపై కేసునమోదు చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ఏప్రిల్ 24న షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. గతనెల 25న షర్మిలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ కోర్టులో విచారణకు షర్మిల హాజరుకావాల్సి ఉంది.. అయితే ఆమె తరపు న్యాయవాది కోర్టులో గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేనెల 5వ తేదీకి నాంపల్లి కోర్టు విచారణ వాయిదా వేసింది.

ఇటీవల టీఎస్‌‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు (TSPSC Paper Leakage Case)లో సిట్‌ అధికారులను కలిసేందుకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె.. ఓ ఎస్సై స్థాయి అధికారిపై చేయిచేసుకోగా, మరో మహిళా కానిస్టేబుల్‌ను చేత్తో నెట్టేశారు. ఓ కానిస్టేబుల్‌ గాయాలపాలవడానికి కారణమయ్యారు. చివరకు షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, చేయి చేసుకున్నారంటూ ఎస్సై రవీందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షర్మిల, ఆమె కారు డ్రైవర్‌ బాలు, మరో డ్రైవర్‌ జకీర్‌పై ఐపీసీ 332, 353, 407, 509 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. షర్మిలకు చెందిన రెండు వాహనాలను సీజ్‌ చేశారు.

Updated Date - 2023-05-08T17:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising