ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryapeta: ఇదెక్కడి మోసం బాబోయ్.. బంగారం అనగానే అత్యాశకు పోతే ఇలానే ఉంటది..!

ABN, First Publish Date - 2023-02-22T12:04:18+05:30

ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి మెడలోని పుస్తెల తాడును ఇచ్చి ఓ దంపతులు మోసపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిరాల, ఆంధ్రజ్యోతి: ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి మెడలోని పుస్తెల తాడు (Gold Chain) ను ఇచ్చి ఓ దంపతులు మోసపోయారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు, ఎస్ ఐ నర్సింగ్ వెంకన్న తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన యరకలి సైదులు, రాధిక దంపతులు గ్రామంలో కిరాణ దుకాణం (General Store) నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐదు రోజుల నుంచి గుర్తు తెలియని ఒక పురుషుడు, స్త్రీ దుకాణం వద్దకు వచ్చి గ్రామంలో డ్రిల్లింగ్ పనులు చేస్తున్నామని పలు వస్తువులు కొనుగోలు చేసి వెళ్తున్నారు. ఇదే క్రమంలో తమకు యాదగిరిగుట్ట వద్ద డ్రిల్లింగ్ చేస్తుంటే బంగారం ముద్ద దొరికిందని ఇక్కడి ఏరియాలో ఎవరూ తమకు తెలియదని మీరే అమ్మి పెట్టాలని కోరారు.

ఈ క్రమంలో ముందుగా ఒక రోజు ముద్దలోంచి రెండు గ్రామాల బంగారం (Gold) ఇచ్చి పరీక్షించుకోవాలని సూచించారు. సైదులు దంపతులు పరీక్షించుకోగా అది నిజమైన బంగారంగా తేలింది. దీంతో మంగళవారం ఇరువురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కిరాణ దుకాణానికి వచ్చి సైదులు,రాధిక దంపతులకు బంగారం కలిగిన ముద్దను అందజేసి, పరీక్షించుకుని రావాలని పంపించారు. అదే సమయంలో మీ వారికి ఇంత మొత్తంలో బంగారం ముద్ద ఇస్తున్నాం. అతడు వచ్చే దాక రాధిక మెడలోని పుస్తెలతాడు ఇవ్వాలని కోరారు. దీంతో ఆమె తీసి ఇచ్చింది. సైదులు బంగారం ముద్ద పరీక్షకు వెళ్లగా ఆ మాట ఈ మాట చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం నుంచి వెళ్లిపోయారు. ఇంతలో బంగారం ముద్ద నకిలీదని తెలుసుకొని సైదులు భార్య రాధికకు ఫోన్ చేసి వచ్చేలోపు వారు అక్కడ లేరు. దీంతో బాధితులు లబోదిబోమంటూ గ్రామంలో వెతికినా అప్పటికే గ్రామం దాటి వెళ్లిపోయారు. బాధితురాలు రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ నర్సింగ్ వెంకన్న తెలిపారు.

Updated Date - 2023-02-22T12:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising