ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ManikRao Thackeray: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వస్తుంది.. అంతా కలిసికట్టుగా పనిచేస్తారు

ABN, First Publish Date - 2023-06-27T16:20:22+05:30

తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్ రావ్ థాక్రే తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 100 శాతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్ రావ్ థాక్రే (Telangana Congress affairs in-charge Manik Rao Thackeray) తెలిపారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం నిర్వహించారు. అనంతరం మానిక్‌రావ్ మీడియాతో మాట్లాడుతూ.. 100 శాతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) అధ్యక్షతన సమావేశం జరిగిందని.. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై (KCR Government) తెలంగాణ ప్రజలకు కోపంగా ఉన్నారన్నారు. పదేళ్ల తర్వాత కూడా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సిన అంశాలపై చర్చించామన్నారు. కాంగ్రెస్‌తో తెలంగాణ వికాస్ ఉంటుందని చెప్పారు. కేసీఆర్ (CM KCR), బీఆర్‌ఎస్ (BRS) అన్ని రాష్ట్రాలలో బీజేపీతో (BJP) జత కడుతుందని తెలిపారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గట్టిగా ఉన్న చోట బీజేపీకి లాభం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మానిక్‌రావ్ థాక్రే విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-06-27T16:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising