ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: రూ.6,71,757 కోట్లకు పెరిగిన తెలంగాణ అప్పు..!

ABN, Publish Date - Dec 20 , 2023 | 12:06 PM

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై భట్టి మాట్లాడుతూ.. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై భట్టి మాట్లాడుతూ.. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు.

ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు విడుదల చేసిన శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు ఏవంటే.. ‘‘తెలంగాణ బడ్జెట్‌కు.. వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది. ‘‘ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు.. వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది. 2014- 15 లో అప్పు 72,658 కోట్లు . ప్రస్తుతం రూ.6,71,757 కోట్లకు అప్పు పెరిగింది. పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగింది.

రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది. దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది. విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది. రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం’’ అని పేర్కొన్నారు. ఇక తాము 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని భట్టి తెలిపారు. అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు.

Updated Date - Dec 20 , 2023 | 12:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising