ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Governor Tamilisai: పెండింగ్ బిల్లులుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం.. వివాదం సమసినట్టేనా..?

ABN, First Publish Date - 2023-04-10T12:11:55+05:30

కేసీఆర్ సర్కార్ అసెంబ్లీలో ఆమోదించి తన వద్దకు పంపిన బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిన బిల్లుల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ (KCR Government) అసెంబ్లీలో ఆమోదించి తన వద్దకు పంపిన బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Telangana Governor Tamilisai) ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS Government) పంపిన బిల్లుల్లో మూడు బిల్లులకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సోమవారం ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో రెండు బిల్లులను గవర్నర్‌ తమిళిసై రాష్ట్రపతికి పంపారు. గవర్నర్‌ దగ్గర మరో మూడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తాము ఎన్నో రకాల ఉద్దేశాలు, లక్ష్యాలతో బిల్లులను ఆమోదించి పంపితే గవర్నర్‌ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, బిల్లుల్లో స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదని, అందుకే పెండింగ్‌లో పెట్టాల్సి వస్తోందని రాజ్‌భవన్‌ వర్గాలు ఇన్నాళ్లూ చెప్పుకొచ్చాయి. గత సెప్టెంబరులో జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి, అదే నెల 13న గవర్నర్‌ తమిళిసైకి పంపించింది. వాటిలో జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్‌ ఆమోదించారు. మిగతా ఏడింటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లుల విషయంలో గవర్నర్ తాజాగా పైన పేర్కొన్న విధంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Gold Rate Today: ఏప్రిల్ 10 కూడా వచ్చేసింది.. ఇవాళ బంగారం ధర పరిస్థితి అయితే ఇది..!

ఇదిలా ఉండగా.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. బడ్జెట్‌ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదని పిటిషన్లో పేర్కొంది. తన పిటిషన్లో ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శిని చేర్చింది.

ఇది కూడా చదవండి: Hyderabad IT Employees: హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఊరట.. ఎంత గుడ్‌న్యూస్ అంటే..

శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్‌ 32 కింద సుప్రీం కోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ న్యాయస్థానం తలుపు తట్టక తప్పలేదని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ జరపనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై పెండింగ్ బిల్లుల ఫైలు బూజు దులపడం గమనార్హం.

Updated Date - 2023-04-10T12:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising