Telangana: భట్టి విక్రమార్క- హరీష్‌రావు మధ్య ఆసక్తికర సంభాషణ
ABN, First Publish Date - 2023-02-11T18:35:25+05:30
అసెంబ్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)-మంత్రి హరీష్‌రావు (Harish Rao) మధ్య సంభాషణ చోటుచేసుకుంది.
హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)-మంత్రి హరీష్‌రావు (Harish Rao) మధ్య సంభాషణ చోటుచేసుకుంది. ‘‘కాళేశ్వరానికి పెద్ద ఎత్తు నిధులు ఖర్చు చేశారు. 18 లక్షల ఎకరాల కోసం బ్యారేజీ కట్టారు.. కానీ ఎక్కడా నీళ్లు ఇవ్వలేదు. మునిగిపోయిన పంపుల పరిశీలనకు వెళ్లనివ్వలేదు’’ అని భట్టి చెప్పుకొచ్చారు. భట్టి వాదనకు హరీశ్ రావు చెప్పిన విషయం ఏమిటంటే.. ‘‘వెళ్తామంటే చెప్పిండి.. రేపే దగ్గరుండి తీసుకెళ్తాం. కాంగ్రెస్ హయాంలో పాలమూరు బిడ్డలు ఎందుకు వలసపోయారు?. రాష్ట్రంలో 7 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాం. పాలమూరు ప్రజల గోస తీర్చిన ఘనత BRSది. మేము కట్టిన ప్రాజెక్టుల వల్లే నీళ్లు వచ్చాయి. రూ. 3,600 కోట్లతో 5 లక్షల ఎకరాలకు సాగునీరుచ్చాం. ట్రిబ్యునల్‌లో పోరాడి సీమ ఎత్తిపోతల పనులు నిలిపివేసేలా చేశాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయి’’ అని హరీశ్ రావు సమాధానం చెప్పారు. వెంటనే అందుకున్న భట్టి,... ‘‘మాకు మైక్ కట్ చేసి వాళ్లకు ఎలా ఇస్తారు?. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉంది.’’ అని అన్నారు. హరీశ్ రావు సమాధానం ఇస్తూ.. ‘‘కొరడాతో మేం కొట్టడం లేదు, మీకు మీరే కొట్టుకుంటున్నారు. మీ అధ్యక్షుడు ఒకటి.. మీరు మరొకటి మాట్లాడతారు’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.
Updated Date - 2023-02-11T18:35:28+05:30 IST